స‌ర్కార్ గుడ్ న్యూస్ 22 నుంచి రైతు భ‌రోసా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎక‌రం వ‌ర‌కు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ‌దిలీ చేయ‌నున్నారు.

త‌ర్వాత మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించింది తెలంగాణ స‌ర్కార్. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణారావు, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి సురేంద్ర మోహ‌న్‌ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *