newsseals.com
News

సంస్థాగ‌త బ‌లోపేతానికి కృషి చేయాలి

VijayaBhaskar March 16, 2026
newsseals-APBJP
Spread the love

స్ప‌ష్టం చేసిన స‌త్య కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి : పార్టీ ప‌రంగా సంస్థాగ‌త ప‌రంగా మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ” రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్నారు . ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా విచ్చేచారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ . పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, కార్యకర్తల పాత్రపై ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ , స‌ర్ రాష్ట్ర కన్వీనర్ , ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స‌ర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇదే స‌మ‌యంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ స‌ర్ చరిత్రను, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను స్పష్టంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి , శాసనసభ బిజెపి పక్ష నేత పెన్మత్స విష్ణు కుమార్ రాజు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, BLA-1లు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతానికి, బూత్ స్థాయి వరకు కార్యకర్తలను మరింత చైతన్యవంతం చేసే దిశగా ఈ రాష్ట్ర కార్యశాల కీలకంగా నిలిచింది.