స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను “స్వేచ్ఛ” తండ్రి శంకరన్నకు అందజేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం మేనేజింగ్ కమిటీ సభ్యుల వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ద్వారా సమకూర్చబడింది. )
ఈ సందర్భంగా “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని శంకరన్నకు హామీ ఇచ్చారు సంస్థ ప్రెసిడెంట్ బ్ర‌హ్మాండ‌గిరి గోపరాజు. త‌న జీవిత‌మంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన గొప్ప జ‌ర్న‌లిస్టు స్వేచ్ఛ అని పేర్కొన్నారు. ఆమె మ‌న మ‌ధ్య లేక పోవ‌డం బాధగా ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భ‌రోసా కల్పించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *