బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన శివ‌సేన నాయ‌కురాలు

ముంబై : ప్ర‌ముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు, ఎందుకంటే లైంగికంగా ప్రేరేపించే లేదా అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్ అయినా, సమాజంలో మెరుగైన విలువ వ్యవస్థలను నిలబెట్టడమే లక్ష్యంగా ఉన్న భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాల ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుంద‌ని అన్నారు. అటువంటి కంటెంట్ ముసుగులో ఉన్న భావప్రకటనా స్వేచ్ఛ కంటే మన సంస్కృతి, సభ్యత చాలా ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు షైనా ఎన్సీ.

సమాజంలో అశ్లీలత లేదా అసభ్యత లేకుండా చూసేందుకే జాతీయ మహిళా కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. తాము చేస్తున్నామ‌ని, జ‌నం చూస్తున్నార‌ని ఎలా ప‌డితే అలా చేసుకుంటూ పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మ‌నం కూడా స‌మాజంలో నివ‌సిస్తున్నామ‌నే సోయి లేకుండా ఎలా ప‌డితే అలా బ‌ట్ట‌లు విప్పేస్తూ, స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా నాట్యం చేయ‌డం, అంత‌కు మించి జుగుస్సాక‌రంగా పాట‌ల‌ను స్వ‌ర ప‌ర్చ‌డం మామూలై పోయింద‌న్నారు.

  • Related Posts

    సినీ ద‌ర్శ‌కుల‌కు దురంధ‌ర్ – 2 ఒక పీడ‌క‌ల‌

    Spread the love

    Spread the loveవివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాము గోపాల్ వ‌ర్మ‌ హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ దురంధ‌ర్- 2 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన ప్ర‌తిచోటా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఈ…

    పైడి జైరాజ్ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ న‌టుడు, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్. శిల్ప క‌ళా వేదిక‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *