జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

Spread the love

బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కామెంట్స్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని అన్నారు. ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నిష్కళంకమైన నేత అని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవ‌స‌రం నేటి యువ‌త‌రానికి ఉంద‌న్నారు. రాజకీయాల‌లోకి రావాల‌ని అనుకున్న వాళ్లకు త‌ను ఓ స్పూర్తి అని పేర్కొన్నారు, ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. అధిష్టానం అనుమతిస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనను పార్టీలోకి తీసుకొస్తానని ప్ర‌క‌టించారు.

రోజు రోజుకు రాజ‌కీయాలు క‌లుషిత‌మై పోయిన త‌రుణంలో ఇలాంటి వాళ్లు ఉండ‌డం చాలా అరుదు అని పేర్కొన్నారు, అవసరమైతే మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని భుజాన‌ మోస్తానని వ్యాఖ్యానించారు. గన్‌మెన్లు, ఆర్భాటాలు లేకుండా సామాన్యంగా తిరిగే ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని కొనియాడారు ఎమ్మెల్యే సంజ‌య్. త‌న జీవిత కాలంలో ఆయ‌న అరుదైన నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లే నేటి స‌మాజానికి అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే.

  • Related Posts

    పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

    Spread the love

    Spread the loveగ‌రిక‌పాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్ అమ‌రావ‌తి : మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో…

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    Spread the love

    Spread the loveహైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *