యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

కంటెంట్ క్రియేటర్ల‌కు మంచి అవ‌కాశం

హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల నిడివి కలిగిన రెండు కేటగిరీలలో షార్ట్ ఫిలిమ్స్ లేదా పాటలను పంపించవచ్చని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్ రాజు విడుదల చేశారు.

ఈ పోటీలకు సంబంధించిన ప్రధాన ఇతివృత్తాల గురించి వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్, తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాలు అనే అంశాలపై యువత తమ సృజనాత్మకతను వెలికి తీయాలని దిల్ రాజు కోరారు.

పోటీలో ఎంపికైన ల‌ఘు చిత్రాల‌కు సంబంధించి మొదటి బహుమతిగా రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ. 2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ. 1 లక్ష అందిస్తామ‌ని పేర్కొన్నారు. వీటితో పాటు మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందజేస్తామ‌ని తెలిపారు. విజేతలకు నగదుతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామ‌ని వెల్ల‌డించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి యువ కళాకారులను అనేక రకాలుగా ప్రోత్సహిస్తామని దిల్ రాజు స్ప‌ష్టం చేశారు.

ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వారు, సృజ‌నాత్మ‌క‌త‌ను క‌లిగి ఉన్న వారు తమ ఎంట్రీలను సెప్టెంబర్ 30 లోపు పంపించాల్సి ఉంటుందని వెల్ల‌డిచారు. ఎంట్రీలను పరిశీలించడానికి నిపుణులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎంపికైనవి మాత్రమే బహుమతులకు అర్హత పొందుతాయని తెలిపారు. ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని అర్హతలు ఇలా ఉన్నాయి. పాల్గొనే వారి వయసు 40 ఏళ్ల లోపు ఉండాలని,. కంటెంట్ 4కె రిజల్యూషన్ మాత్ర‌మే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పోటీ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలని, గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదని తెలిపారు. ఈ ఎంట్రీల‌ను youngfilmmakerschallenge @gmail.com అనే ఈ-మెయిల్ లేదా 8125834009 అనే వాట్సాప్ నంబర్‌కువాట్సాప్ ద్వారా పంపించాల‌ని కోరారు.

  • Related Posts

    సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

    అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *