సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

Spread the love

కీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వ సహకారం, పరిపాలనా సామర్థ్యాల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా, ప్రభుత్వ శాఖలకు సింగపూర్ లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శిక్షణ ఇవ్వనున్న‌ట్లు తెలిపారు మంత్రి ప‌య్యావుల కేశవ్.

ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంద‌ని సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌కు తెలియ చేశారు. పాల‌నా ప‌రంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు మంత్రి. ఇందులో భాగంగా మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా మార్పులు చేయ‌డం జ‌రిగంద‌న్నారు. దీని వ‌ల్ల పారిద‌ర్శ‌క‌త పెరిగింద‌ని, సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా, అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప‌రంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు నిరంత‌రం శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్.

  • Related Posts

    తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలక‌మైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత…

    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ హైద‌రాబాద్ : ప్రోటోకాల్ ను పాటించ‌డం లేద‌ని, ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *