చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యా శాఖ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్కూల్స్, గురుకులాల‌తో పాటు అంగ‌న్వాడీల‌లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఇదే శాఖ‌ను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంత‌గా న‌డుస్తున్న అంగ‌న్వాడీ కేంద్రాల‌కు తీపి క‌బురు చెప్పారు. ఇందులో చ‌దువుకుంటున్న చిన్నారుల ఆక‌లిని తీర్చేందుకు న‌డుం బిగించారు.

ఈ మేర‌కు తొలి ముద్ద అనే పేరుతో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించారు. దీనిని బ్రేక్ ఫాస్ట్ స్కీం అని పేరు పెట్టారు. మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌ల‌తో క‌లిసి స‌చివాల‌యంలో ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు సీఎం. మా ఆలోచన ఎంత మంచిదైనా, అంగన్వాడీ లు దానిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయన్నారు ఈ సంద‌ర్బంగా. అంగన్వాడీ లు త‌మ‌ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు అని అన్నారు. వారి సమస్యల పై మాకు అవగాహన ఉందన్నారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు వచ్చినా మాకు మొదట గుర్తుకు వచ్చేది అంగన్వాడీ లే.న‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *