త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు పైన మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చర్చించారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని స్ప‌ష్టం చేశారు సీఎం.

రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు. ఫార్మసీ నెట్వర్క్, ల్యాబొరేటరీ ఇంట్రిగ్రేషన్ జరగాలన్నారు. అనారోగ్య సమస్యలు, అత్యవసరవ వైద్య పరిస్థితులు, వైద్య బృందం సూచనల మేరకు మాత్రమే గర్భిణులకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలన్నారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

    Spread the love

    Spread the loveశ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తిపై సీరియ‌స్ హైద‌రాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను…

    దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    Spread the love

    Spread the loveకేంద్ర స‌ర్కార్ నిర్వాక‌మేన‌న్న వైఎస్ ష‌ర్మిలా విజ‌య‌వాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాక‌ర‌మ‌ని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్ర‌లో భాగ‌మేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *