ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్

ఉస్మానియా యూనివ‌ర్శిటీ కీల‌క ప్ర‌క‌ట‌న

హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు’ లేదా ‘ఆదిత్య బిజినెస్ స్కూల్’ అనే పేర్లతో ఉన్న ఏ కళాశాలలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపును మంజూరు చేయలేదని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా పొడిగించ లేద‌ని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా విశ్వ విద్యాలయం వంటి సమర్థ అధికారుల నుండి అనుమతి పొందకుండా, ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు/ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజీలు’ అని ప్రకటనలు వెలువడుతున్నాయ‌ని హెచ్చ‌రించింది.

ఇది అనుబంధ గుర్తింపు నిబంధనలను ఉల్లంఘించడమే కాక, వాటికి విరుద్ధం కూడా అని పేర్కొంది. అందువల్ల, ప్రజలు ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు/ఆదిత్య బిజినెస్ స్కూల్’ అని వచ్చే అటువంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలకు మోస పోవ‌ద్ద‌ని కోరింది. ఆ కళాశాలల్లో ఎవ‌రూ చేరవద్దని హెచ్చరించింది. త‌మ భ‌విష్య‌త్తు అంధాక‌రం చేసుకోవ‌ద్ద‌ని సూచించింది ఉస్మానియా యూనివ‌ర్శిటీ. ఈ మేర‌కు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో ఓయు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *