
హెచ్ 1 బి వీసా రుసుము భారీగా పెంపుతో షాక్
అమెరికా : ఫస్ట్ అమెరికా ఆ తర్వాతే ఏ దేశమైనా, ఎవరైనా సరే అని అమెరికా ఎన్నికల సందర్బంగా కీలక ప్రకటన చేసిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో కొలువు తీరాక రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ విదేశీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో ఎక్కువగా ఉద్యోగాలు, పనులు చేసే వారిలో మొదట భారతీయులు ఉండగా ఆ తర్వాతి స్థానంలో చైనీయులు ఉన్నారు. అక్కడి కంపెనీలలో పని చేయాలంటే నైపుణ్యం కలిగిన వారికి హెచ్ 1బి వీసా తప్పనిసరిగా పొందాల్సిందే. గతంలో ప్రభుత్వం ఈ వీసా పొందాలంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసేవారు. వీసాలను మంజూరు చేసే వారు. కానీ ట్రంప్ వచ్చాక దానికి మంగళం పాడారు. ఏకంగా ప్రవాస భారతీయులకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఏకంగా హెచ్ 1 బి వీసా పొందాలంటే ఫీజు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం కూడా పెట్టేశాడు. దీంతో పెద్ద ఎత్తున ఇండియన్స్ కే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఎన్నారైలు లబో దిబోమంటున్నారు.
ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంస్థలు H-1B వ్యవస్థను ప్రముఖంగా మార్చాయి, కంప్యూటర్ సంబంధిత రంగాలలోని అమెరికన్ కార్మికులకు గణనీయంగా హాని కలిగించాయి అని ఈ సందర్బంగా సంచలన కామెంట్స్ చేశారు ట్రంప్. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించే లేదా ప్రవేశించడానికి ప్రయత్నించే విదేశీయులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. యజమానులు చెల్లింపు రుజువును కలిగి ఉండాలి. విదేశాంగ కార్యదర్శి చెల్లింపు రసీదును ధృవీకరించాలి. యజమానులు ఈ చెల్లింపు చేయని వారికి ప్రవేశాన్ని నిరాకరించే బాధ్యతను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, విదేశాంగ శాఖ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు ట్రంప్.