పెట్టుబ‌డుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి

స్ప‌ష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చాయ‌న్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల గ్రౌండింగ్ పై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ఆల‌స్యం అయితే దానికి గ‌ల కార‌ణాల‌ను, సమస్యలను గుర్తించాలని అన్నారు. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం అని పేర్కొన్నారు నారా లోకేష్‌. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం అని చెప్పారు.

ఈడీబీని మరింత బలోపేతం చేస్తాం అని ప్ర‌క‌టించారు మంత్రి. ప్రతి శాఖ ఈడీబీ ట్రాకర్ ను పర్యవేక్షించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను నామినేట్ చేయాలని ఆదేశించారు నారా లోకేష్‌. ఎంఎస్ఎంఈ పార్క్ లు, టెక్స్ టైల్ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకింగ్ అంశాలపైనా సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *