newsseals.com
News

ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు

VijayaBhaskar April 8, 2026
newsseals-PerniNani
Spread the love

మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్

అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ న్యూస్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై తీవ్ర స్థాయిలో భ‌గ్గుమ‌న్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని బ‌రి తెగించాడ‌ని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే గంజాయ్ పండించిన వాడి కంటే నీచంగా తయార‌య్యాడ‌ని మండిప‌డ్డారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బు దండుకుంటున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పేర్ని నాని.

ఏరా నీ స్టూడియో లో పెళ్ళిళ్ళ బ్రోకర్ గా పనులు చేస్తున్నావా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారో చెప్పాల‌ని నిల‌దీశాడు మాజీ మంత్రి. త‌మ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా? అని నిల‌దీశారు. ఇప్పుడు కాదు క‌దా వందేళ్లయినా అమరావతి పూర్తి కాదన్నారు. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.