ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా పోలీస్ సేవ‌లు

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టించారు మంత్రి. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని , పెదవేగి సర్కిల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు వంగ‌ల‌పూడి అనిత‌. మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించడం జ‌రిగింద‌ని చెప్పారు.

త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించామ‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా, ప్రజలకు చేరువగా పోలీసు సేవలను తీసుకెళ్లడమే మా ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో పోలీసుల‌కు విలువ లేకుండా చేశార‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక పోలీస్ ఫ్రెండ్లీ స‌ర్కార్ గా మార్చేశామ‌ని అన్నారు. ఏ ఒక్క‌రికి అన్యాయం జ‌రిగినా ఊరుకునేది లేద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి : కాకినాడ, పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభివృద్ది కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేయాల‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలని స్ప‌ష్టం…

    1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములు

    Spread the love

    Spread the loveఇచ్చామ‌న్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *