డీసిల్టింగ్ ప‌నుల తీరుపై వివ‌రాలు ఇవ్వండి

Spread the love

ఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని కృష్ణాన‌గ‌ర్‌, అమీర్‌పేట త‌దిత‌ర‌ డివిజ‌న్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం త‌మ‌కు ఇవ్వాల‌ని స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కోరారు. వ‌ర్షాకాలం ఇబ్బందులు ప‌డే వారు మీరని, స‌మ‌స్య ఎక్క‌డుందో మీకు చాలా స్ఫ‌ష్టంగా తెలుస్తుందన్నారు. ఆ స‌మ‌స్య‌కు కార‌ణం, ప‌రిష్కారం కూడా మీకు తెలుసు అని పేర్కొన్నారు క‌మిష‌న‌ర్ . ఆ స‌మాచారం అధికారుల‌కు చేర‌వేస్తే ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ వంతెన వ‌ద్ద పెద్ద‌మొత్తంలో పూడిక‌ను తీయ‌డాన్ని ప‌రిశీలించారు.

అలాగే కృష్ణాన‌గ‌ర్‌లో వేస‌వి కాలంలోనే మురుగు ర‌హ‌దారుల‌పైకి రావ‌డాన్ని గ‌మ‌నించారు. ప్ర‌తి వంద మీట‌ర్ల‌కూ పూడిక తీత ఎలా జ‌రుగుతుంద‌నేది స్ప‌ష్ట‌త ఉండాల‌ని సూచించారు. ఇప్పుడు పూడికను మొత్తం తొల‌గిస్తే.. వ‌ర్షాకాలం వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకాలు లేకుండా ఉంటుంద‌ని చెప్పారు క‌మిష‌న‌ర్. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న డీ సిల్టింగ్ ప‌నుల్లో ఎక్క‌డైనా ఇబ్బందులు త‌లెత్తినా.. కావాల్సిన మిష‌న‌రీ అవ‌స‌ర‌మైనా వెంట‌నే ఆ విష‌యాన్ని త‌మ దృష్టికి తీసుకువ‌స్తే స‌మ‌కూర్చుతామ‌ని చెప్పారు. అక్క‌డ ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న జీహెచ్ ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారుల‌కు సూచించారు. డీఆర్ ఎఫ్ సిబ్బంది మీ వెన్నంటే ఉంటార‌ని, ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా స‌హ‌క‌రిస్తార‌ని చెప్పారు.

  • Related Posts

    వైశాఖి వేడుక‌ల కోసం కేటీఆర్ కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveరావాల‌ని కోరిన గురుద్వారా క‌మిటీహైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు…

    పిల్ల‌ల‌ను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంచాలి

    Spread the love

    Spread the loveఇందు కోసం చ‌ట్టం కూడా తీసుకు వ‌స్తున్నాం అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టెక్నాల‌జీ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. ఇదే క్ర‌మంలో ఇప్పుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *