జ‌గ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌పై ఆనం ఎద్దేవా

ఏపీని విధ్వంసానికి గురి చేసిన మాజీ సీఎం

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి రేపటి జువ్వలదిన్నె పర్యటనపై నిప్పులు చెరిగారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ హయాంలో, పాలకులు పరిపాలన కంటే విధ్వంసానికి బీజం వేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జగన్ రెడ్డికి ఇప్పుడు ‘గన్ కల్చర్’ కావాల్సి వచ్చిందన్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

లక్షలాది మంది రైతులు నిరాశ్రయులైనా, కన్నెత్తి చూడని దుర్మార్గుడు జగన్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చ‌స్త్రశారు మంత్రి. ఒకరు బాగుపడితే చూడలేని మ‌న‌స్త‌త్వం త‌న‌ది అని పేర్కొన్నారు. జగన్ ఇంట్లో ఉండి పబ్జి ఆడుకోవడం బెటర్ అన్నారు. వైసీపీ నాయకులు ఎవరైనా హద్దులు మీరితే తాటతీస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌. రాష్ట్రం నుండి పిట్టలు ఎగిరినట్లు ఎగురుతారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *