సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి న‌ట‌రాజ‌న్ భేటీ

హాజ‌రైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ బుధ‌వారం హైద‌రాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎమ్మెల్యేలు ఎవ‌రి మాట విన‌డం లేద‌ని, మంత్రులు త‌లోదారి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో మీనాక్షి స‌మా వేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో, పార్టీలో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించిన‌ట్లు స‌మాచారం

ఎమ్మెల్యేల అసంతృప్తి.. బాహాటంగానే విమర్శలు ఆరోపణలు చేస్తున్న వైనం పై మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఆరా తీసింద‌ని, దీనికి స‌మాధానం చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు సీఎం, టీపీసీసీ చీఫ్‌. ప్ర‌త్యేకించి మంత్రుల‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు లెక్క‌కు మించి వ‌చ్చాయి. జగిత్యాల పరిణామాలు.. నామినేటెడ్ పదవులు.. మహిళా బిల్లు నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై చర్చకు వ‌చ్చాయి. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల పభుత్వానికి పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ పైనే ఈ సమావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *