టీవీకే పార్టీలో చేరిన న‌టి అను శ్రీ వేనాల్

Spread the love

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు పార్టీ బాస్, సీఎం ఎంకే స్టాలిన్. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ స్థాపించిన టీవీకే ప్ర‌చారంలో దూసుకు పోతోంది. నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పార్టీల‌లో చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్ర‌ముఖ న‌టి అను శ్రీ వేనాల్ ఆస‌క్తిక‌రంగా మారారు. త‌ను టీవీకే పార్టీలో చేరారు.

చెన్నై లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పార్టీ చీఫ్ , అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు అను శ్రీ వేనాల్. ఈ సంద‌ర్భంగా ఆమెకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆమెతో పాటు ప‌లువురు పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి టీవీకే బాస్ విజ‌య్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు తెర లేపారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మొత్తంగా ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చ‌ర్చ కొన‌సాగుతోంది. ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    రూ. 390 క‌డితే చాలు అందాల ఆర‌బోత‌

    Spread the love

    Spread the loveఅభిమానుల‌కు విష్ణుప్రియ‌, అన‌న్య ఆఫ‌ర్ హైదరాబాద్ : సోష‌ల్ మీడియాలో ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ల జోరు పెరుగుతోంది. దీంతో విష్ణుప్రియ, అనన్య నాగలాలు తమ గ్లామర్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ నమూనాలు పెరగడంతో వాటి ప్రభావం,…

    న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

    Spread the love

    Spread the loveనవ్వడం తెలిసిన అరుదైన న‌టుడు హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ఏప్రిల్ 16 ఆయన జ‌యంతి. ఈ సంద‌ర్బంగా మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఘ‌నంగా నివాళులు అర్పించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *