కాల్పుల విరమ‌ణ ఒప్పందం పొడిగింపు

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌శ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో త‌గ్గితే స‌రి లేక పోతే యుద్దం చేయాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అయినా ఇరాన్ ఒప్పుకోలేదు. మ‌రో వైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా వార్ ను ఆప‌బోమంటూ కౌంట‌ర్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా అమెరికా చీఫ్ సూచ‌న‌తో పాకిస్తాన్ దేశ ప్ర‌ధాని రంగంలోకి దిగారు. ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ త‌రుణంలో ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని బుధ‌వారం సామాజిక మాధ్యమాల్లో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలకు రాబోమని ఇరాన్ తెగేసి చెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా ప‌డింది.

  • Related Posts

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

    Spread the love

    Spread the loveపులివెందుల లోని ఆయ‌న నివాసంలో క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని పులివెందుల త‌న‌ నివాసంలో,కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *