ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డి ఫైర్

ఆయ‌న‌ను చంపితే నేనే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న

రంగారెడ్డి జిల్లా : కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ,లక్ష్మణుడు పై వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యల పై కర్మన్ ఘాట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ను అన్ని సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన పదజాలం తో శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

ప్రకాష్ రాజును ఎవరైనా చంపితే అందుకు తాను బాధ్యత వహిస్తాను అంటూ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం పై ఇక పై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని అన్నారు. ప్రకాష్ రాజు కు సంబంధించి ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వచ్చి కొడుతామంటూ హెచ్చరించారు.
సినీ అగ్ర హీరోలు, నిర్మాతలు ప్రకాష్ రాజు ను బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నాస్తికుడు అనే ముసుగులో హిందూ ధర్మం పై దాడి చేస్తున్నాడని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజెపి నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *