Friday, 16 October 2026

కోట్ల కుంభ‌కోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి

newsseals-SmapathNayak

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ డిమాడ్

హైద‌రాబాద్ : రూ. 200 కోట్ల‌కు పైగా కొన‌సాగుతున్న డ‌బ్బులు వ‌సూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మంగ్లీని వెన‌కేసుకు వ‌స్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ సంప‌త్ నాయ‌క్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సింగ‌ర్ మంగ్లీ పాత్ర కీల‌క‌మ‌ని, ఆమె పాత్ర ఏమిటో తేల్చాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ మోసాలపై నిగ్గు తేల్చాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై ఉంద‌న్నారు. అధిక వడ్డీ ఆశచూపి కోట్లు వసూలు చేసిన వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ తన ఫోన్ కట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. కర్ణాటక మాజీ మంత్రి మనవడి నుంచి అందిన ₹80 లక్షల వ్యవహారంలో మంగ్లీ తమ్ముడి పాత్రపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. బెంగళూరు సమీపంలోని కోట్ల విలువైన ఆరు ఎకరాల భూమి ఎవరిదో చెప్పాలని సంపత్ నాయక్ నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *