టీవీకే విజ‌య్ సీఎం కావాలి : విటివి గ‌ణేష్

నేను ఆయ‌న‌కే ఓటు వేశాన‌ని ప్ర‌క‌ట‌న

త‌మిళ‌నాడు : ప్ర‌ముఖ న‌టుడు విటివి గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్బంగా త‌న విలువైన ఓటు వేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టారు. నేను ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన‌ టీవీకే పార్టీకి ఓటు వేశానని వెల్ల‌డించారు. సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ సరిగ్గా సరిపోతాడని తాను న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు విటివి గ‌ణేష్.

ఏది ఏమైనా త‌మిళ‌నాడు రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు పార‌ద‌ర్శ‌త లోపించింద‌న్నారు. ఇదే స‌యంలో టీవీకే విజ‌య్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే స్వేచ్చ‌, హ‌క్కు ఉంటుంద‌న్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని యువ‌తీ యువ‌కులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించు కోవాల‌ని విటివి గ‌ణేష్ పిలుపునిచ్చారు. (Photo Courtsy ANI)

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *