Friday, 16 October 2026

న‌టి అనురాగ ఎస్. నంబియార్ భావోద్వేగం

newsseals-AnuragaSNambiar

తాను మోస పోయానంటూ వీడియో రిలీజ్

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి అనురాగ ఎస్. నంబియార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈమేర‌కు స్వ‌యంగా వీడియో సందేశం ద్వారా త‌న ఆవేద‌న‌ను పంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. తాను “మోసపోయానని” తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రిసార్ట్’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన విషయాలపై ఆమె విజయ్ కుమార్ (ఎరుమ సాని ఫేమ్) , అతని భార్యపై ఆరోపణలు చేశారు. న‌టి త‌ను చెప్పిన ప్రకారం, ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు, కానీ షూటింగ్ అనుకున్న ప్రకారం జరగలేదు . ఆమెకు జీతం చెల్లించలేదు.

సెట్‌లో నాసిరకం ఆహారం అందించారని, తాను అనారోగ్యానికి గురైనప్పుడు విజయ్ కుమార్ భార్య తనతో చాలా అమర్యాదగా మాట్లాడారని కూడా ఆమె ఆరోపించారు. ఇలాంటి పద్ధతులు యువ కళాకారులను భయపెట్టి, దోపిడీకి గురిచేస్తాయని పేర్కొన్నారు. అంతే కాకుండా నిర్మాణ బృందంపై చర్య తీసుకోవాలని అనురాగ కోరారు. కాగా తాజాగా అనురాగ ఎస్. నంబియార్ చేసిన తాజా ఆరోప‌ణ‌లు సినీ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపాయి. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌పై న‌టుడు, భార్య నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *