వ్య‌వ‌సాయ రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన జ‌గ‌న్

నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు.
వైసీపీ పాల‌నలో రైతుల‌ను ప‌ట్టించు కోలేద‌ని, వ్య‌వ‌సాయ రంగాన్ని భ్ర‌ష్టు ప‌టి్ంచార‌ని ఆరోపించారు.
2019–2024 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 143–175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే నిలిచిపోయి 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోవడం వైసీపీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుంద‌న్నారు. కానీ 2024 తర్వాత కూటమి పాలనలో 163 లక్షల టన్నుల నుంచి 2025-26లో 237 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి సుమారు 51% వృద్ధి నమోదు కావడం వ్యవసాయ రంగంలో సంభవించిన మార్పున‌కు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యాన రంగంలో కూడా చరిత్రాత్మక పురోగతి సాధిస్తున్నామని పేర్కొంటూ, మైక్రో ఇరిగేషన్‌లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

2014-19లో 6.58 లక్షల హెక్టార్లతో పోలిస్తే, వైసీపీ కాలంలో అమలు తగ్గిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం చేసి 2024-26 మధ్య లక్షల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన బకాయిల్లో రూ.881 కోట్లు చెల్లించడంతో పాటు, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచుతూ, GVAను రూ.1.52 లక్షల కోట్లకు చేర్చామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని, కొత్త విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, ఆదాయం పెంపు, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసే వైసీపీ నేతల మాటలను ప్రజలు తిప్పికొడతారని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా హెచ్చరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *