ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఇంధన రంగంలో పరిశోధన చేసేందుకు గాను ఏపీలో ఎనర్జీ యూనివర్శిటీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం విద్యుత్ రంగంపై సమీక్ష చేపట్టారు.
ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 4.60కు తగ్గించాలన్నారు. ఈ దిశగా విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలో నైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం అన్నారు సీఎం. ప్రజలకు మేలు చేయాలంటే టెక్నాలజీ వినియోగం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ నిరంతరం గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ కు పెద్ద పీట వేయాలన్నారు. దీని కోసం ట్రాన్స్ కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న సీఎస్సార్ నిధులు కేటాయించాలని ఆదేశించారు.
అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటాం. పంప్డ్ స్టోరేజీ విధానంలో విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. పొల్యూషన్ తగ్గేలా… పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆదేశించారు సీఎం. 2028-29 నాటికి సగాని పైగా విద్యుత్ ఉత్పత్తి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చేలా చూడాలి. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 52396 సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు ఇచ్చాం. దీన్ని మరింత వేగంవంతం చేయాలి. ఇకపై ప్రతి నెల 2 లక్షల పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఇచ్చేలా చూడాలి. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చాం అని తెలిపారు. మొదటి విడత పీఎం కుసుమ్ పథకాన్ని డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం.





