తెలంగాణ ఖాకీల‌కు డీజీపీ ఖుష్ క‌బ‌ర్

Spread the love

ప్ర‌త్యేక దినాలకు సెల‌వు మంజూరు

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు . పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించ లేక పోతున్నారని గుర్తించారు డీజీపీ. వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు శివ‌ధ‌ర్ రెడ్డి.

అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు డీజీపీ. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల‌కు 24 గంట‌ల పాటు డ్యూటీ ఉంటోంది. వారికి అత్య‌వ‌స‌రం అయితేనే త‌ప్పా లీవ్స్ ఇవ్వ‌డం లేదు.

  • Related Posts

    సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’…

    బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిహైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *