స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో ఆడబిడ్డల భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాబోదని నేను నమ్ముతానని అన్నారు. అందుకే నిర్ణయాల్లో, సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పారు సీఎం. మహిళలు – పిల్లల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా “స్పందన” పేరుతో టీంలను ఈ రోజు ICCC లో ప్రారంభించడం వారి భద్రత పట్ల మా బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు.
తెలంగాణలో డ్రగ్స్ ను ఎట్టి పరిస్థితులలోను నిర్మూలించాల్సిందేనని ప్రకటించారు సీఎం. డ్రగ్స్ కేసుల ఈ విషయంలో ఎంత పెద్ద వారు ఉన్నా నేను కేర్ చేయనని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజంతోనే మహిళ – పిల్లల భద్రతకు హామీ వస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలబెట్టడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సీతక్క, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






