బీజేపీ మోసం అనైతిక విజ‌యం : దీదీ

ఎన్నిక‌ల సంఘంపై మాజీ సీఎం ఆగ్ర‌హం

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు ముగిశాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై. బీజేపీ 100కి పైగా స్థానాలను దోచుకుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నికల సంఘం అనేది బీజేపీకి చెందిన సంఘం మాత్రమేనంటూ మండిప‌డ్డారు మ‌మ‌తా బెన‌ర్జీ. తాను ఎన్నికల అధికారికి (CO) , మనోజ్ అగర్వాల్‌కూ ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీన్ని మీరు విజయం అని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇది అనైతిక విజయం తప్ప, నైతిక విజయం కానే కాద‌న్నారు. కేంద్ర బలగాలతోనూ, ప్రధానమంత్రి, హోంమంత్రితో నూ కలిసి ఎన్నికల సంఘం చేసినదంతా పూర్తిగా చట్ట విరుద్ధం అని ఆరోపించారు. ఇది దోపిడీ, దోపిడీ, కేవలం దోపిడీ మాత్రమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. తాము భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా పుంజుకుని తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *