భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ
తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఆశించిన దానికంటే భిన్నంగా వచ్చాయి. 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో తమిళనాట ఎంజీ రాంచంద్రన్, జయలలిత తర్వాత మరో అగ్ర నటుడు టీవీకే విజయ్ కు తమిళులు పట్టం కట్టారు. 234 శాసన సభ స్థానాలకు గాను 111 స్థానాలతో టీవీకే పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఝలక్ ఇచ్చారు విజయ్. ఆయనను అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ అన్ని పార్టీల కంటే భిన్నంగా తను మేనిఫెస్టోను ప్రకటించారు. సామాన్యులకే పట్టం కట్టారు. అభ్యర్థులను కూడా తానే ఖరారు చేశారు.
విచిత్రం ఏమిటంటే తన వద్ద పని చేసిన డ్రైవర్ కొడుకుకు శాసన సభ టికెట్ ఇచ్చాడు. మరో వైపు వరుసగా గెలుస్తూ వచ్చిన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది టీవీకే. ఆ పార్టీకి చెందిన వీఎస్ బాబు బంపర్ మెజారిటీ సాధించి గెలుపొందారు. ఇదిలా ఉండగా విజయ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన విజయం సాధించిన వెంటనే ఫుల్ సెక్యూరిటీ మధ్య తను తన ఫ్యామిలీ వద్దకు వెళ్లారు. అక్కడ పేరెంట్స్ ను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా నిన్నటి దాకా గడిపారు. కుటుంబీకులతో ఆనంద క్షణాలను పంచుకున్నారు.






