కీలక ప్రకటన చేసిన గవర్నర్ రవి
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఎవరూ ఊహించని రీతిలో కొన్నేళ్లుగా కొలువు తీరిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సర్కార్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ రవి కలిసి కుట్రలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు మమతా బెనర్జీ. కాగా భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలను వినియోగించుకున్నట్లు వెల్లడించారు గవర్నర్.
అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు వేగవంతం చేశారు. ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానుంది. మొత్తంగా గవర్నర్ రవి సంచలనంగా మారారు.






