ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

Spread the love

బీసీ హాస్ట‌ళ్ల ప‌నితీరు అద్భుత‌మ‌న్న మంత్రి

అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామ‌న్నారు మంత్రి స‌విత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామ‌న్ని, ఇది మంచి ఫ‌లితాలు ఇచ్చేలా చేసింద‌న్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామ‌న్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించార‌ని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల మెనూకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందన్నారు.

దీనివల్ల నెలకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ, ఏడాదికి రూ.6 కోట్లకు పైబడి ఆదా అయ్యిందన్నారు సవిత‌. ఎఫ్ఆర్ఎస్ విధానం మొట్ట మొదటిసారిగా బీసీ హాస్టళ్లలో అమలు చేయడం విశేషం. హాస్టల్ సిబ్బందికి కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా, విధి నిర్వహణలో పారదర్శకత, పర్యవేక్షణ కోసం హెచ్.పి.టి.ఎస్. యాప్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ యాప్ ద్వారా వార్దెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, డీబీసీడబ్ల్యూవోల పనితీరును మరింత మెరుగు పరచడానికి వీలు కలిగిందన్నారు. హాస్టళ్లలో మెనూ అమలు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, తాగునీటి కల్పనపై ఏ రోజుకారోజు ఫొటోలను ఈ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల హాస్టళ్లలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం రాష్ట్ర స్థాయి అధికారులకు కలిగిందన్నారు.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీ‌కారం

    Spread the love

    Spread the loveజాతికి అంకితం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ హైద‌రాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం…

    టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *