
భారీ ఎత్తున వసతి సదుపాయాలు కల్పించాలి
వరంగల్ జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మేడారంలోని సమ్మక్క ,సారలమ్మ దేవాలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బలరాం నాయక్ , కడియం కావ్య, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆలయ విస్తరణ మరియు సంబంధిత మాస్టర్ ప్లాన్ గురించి సీఎం చర్చించారు, 2026 మహా జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని చెట్లను సంరక్షిస్తూ విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని, దీని ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు, ఈ ప్రాధాన్యతను ప్రతిబింబించే ప్రణాళికలను సిద్ధం చేయాలని కోరారు.
సమావేశం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క గద్దెలం ప్రాంగణంలో జరుగుతున్న విస్తరణ , పునర్నిర్మాణ ప్రయత్నాలను పరిశీలించారు. భక్తికి చిహ్నంగా దేవతలకు 68 కిలోల బంగారాన్ని సమర్పించారు . ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. లక్షలాదిగా అమ్మ వార్లను దర్శించుకునేందుకు వస్తారని అన్నారు రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అంతకు ముందు అమ్మవార్లకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతం గొప్ప గిరిజన సంస్కృతిని గౌరవిస్తూనే, మేడారాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తీర్థయాత్రగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుడి ఉందని స్పష్టం చేశారు సీఎం.