కంపెనీలు ఏర్పాటు చేస్తే త‌క్ష‌ణ‌మే ప‌ర్మిష‌న్స్

Spread the love

ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్

సింగ‌పూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవ‌లే ప‌ర్య‌టించారు. సింగ‌పూర్ లో పాల‌నా ప‌రంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా వారికి సింగ‌పూర్ కు చెందిన వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు శిక్ష‌ణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, అచ్చెన్నాయుడు, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్నారు. తాజాగా లోకేష్ ఇప్పుడు కీల‌కంగా మారారు. ఆయ‌న వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హించారు. కంపెనీలు ఏర్పాటు చేస్తే త‌క్ష‌ణ‌మే ప‌ర్మిష‌న్స్ ఇస్తామని ప్ర‌క‌టించారు లోకేష్.

ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశాంగశాఖ మంత్రి గాన్ సియో హువాంగ్, సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ (SCE) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టే లియాన్ చూ, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ సౌత్ ఆసియా ఎకనమిక్ డెవలప్ మెంట్ డైరెక్టర్ ఆడ్రీ టాన్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ లిమ్ చీ కియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జీన్ యీ, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ సీనియర్ మేనేజర్ (మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా) నిషా శారద, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఎస్.జోషి, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఎఎస్ అధికారులు దత్తి సురేంద్ర, అనంత శంకర్, పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బండి భ‌గీర‌థ కేసుపై సీఎం సీరియ‌స్

    Spread the love

    Spread the loveవెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం రేపింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్ప‌టి…

    చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

    Spread the love

    Spread the loveశ్రీవారి చిత్ర‌ప‌టం బ‌హూక‌రించిన సీఎం హైద‌రాబాద్ : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్క‌డే ఉంటారు. ఇక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *