స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో APSADA చట్టం ఉన్నప్పటికీ కేవలం 15 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను తొలగించి 83 శాతం పైగా రిజిస్ట్రేషన్లు సాధించిందన్నారు. అదేవిధంగా 1.65 లక్షల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకువచ్చి, రైతులకు సులభంగా లైసెన్సులు లభించేలా చర్యలు చేపట్టామని వివరించారు.
మేత ధరల నియంత్రణ, విద్యుత్ సబ్సిడీ, మార్కెట్ స్థిరీకరణ, కనీస మద్దతు ధరలు, ఆక్వా క్లస్టర్ల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తోందన్నారు. జగన్ చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఇక లేదు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చిన సమస్యలను ప్రభుత్వం బాధ్యతగా ఎదుర్కొంటోందన్నారు. కానీ రైతుల ఆందోళనను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం మానేయాలని హితవు పలికారు. రైతులను నాశనం చేసి ఇప్పుడు వారి పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం ఆపాలన్నారు.





