ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు

కేటాయించామ‌న్న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

విజయవాడ : రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు కేటాయించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్ర‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ శశిభూషణ్, కడా కమీషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్‌ఈలు, ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు.

కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రెండు విడతలుగా ఓఅండ్ఎం పనుల కోసం నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు నిమ్మ‌ల రామానాయుడు. నేడు కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, అత్యవసర, మరమ్మత్తులు పనుల కోసం 397 కోట్లు కేటాయించాం అన్నారు. గత 5 ఏళ్ళ వైసిపి పాలనలో కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి కనీస నిర్వహణ పనులు చేయలేద‌న్నారు. అత్యవసర పనులు కోసం 10 లక్షలు దాటితే, కాలయాపన లేకుండా, 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లు పిలిచేలా కేబినెట్ ఆమోదించిందన్నారు. మొత్తం 6,502 పనుల్లో 5,943 పనులు సుమారు 91 శాతం సాగు నీటి సంఘాల ద్వారానే పనులు జరుగనున్నాయ‌ని పేర్కొన్నారు. ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సిఈ స్దాయి నుండి కిందిస్దాయి అధికారులు వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. ఓఅండ్ఎం పనులకు సంబందించి, ప్రతి వారం, పనుల వివరాలు, వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు అందించాలన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *