జూన్ 9న శ్రీ వేణుగోపాల స్వామి క‌ళ్యాణోత్స‌వం

జూన్ 6వ తేదీ నుండి 14 వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి జిల్లా : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి జిల్లాలోని పుణ్య క్షేత్రం కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న‌ట్లు తెలిపింది జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌తి రోజూ వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా శ్రీ వేణు గోపాల స్వామికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన జూన్ 9న స్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు అని తెలిపింది. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం ప్రసాదంగా అంద జేయనున్నట్లు పేర్కొన్నారు జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం. మ‌రో వైపు పుష్ప యాగం కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు పుష్పయాగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నామ‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    తిరుపతి : తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విష‌యాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *