టీవీకే పార్టీ విస్త‌ర‌ణ బాధ్య‌త‌లు కీర్త‌న‌కు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పార్టీ చీఫ్

చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే టీవీకే పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ మేర‌కు పూర్తి బాధ్య‌త‌లు ప‌లు భాష‌లు మాట్లాడే మంత్రి కీర్త‌న‌కు అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఆమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. తమిళనాడు ప్రభుత్వంలో బహు భాషలు మాట్లాడగల మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్త‌న‌. త‌ను రాష్ట్రంలోని శివ‌కాశి నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు టీవీకే పార్టీ నుంచి.

పార్టీని కేవలం తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే బాధ్యతను అప్పగించారు.
టీవీకే ఇప్పటికే కేరళ, కర్ణాటకలలో ప్రారంభమైంది, భారీ సంఖ్యలో ప్రజలు ఇందులో చేరుతున్నారు. ఈ పార్టీ దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను ఖచ్చితంగా కబళిస్తుందనే అంచ‌నాలు ఉన్నాయి..మంత్రి కీర్త‌న హిందూ భాషలలో కూడా అద్భుతంగా మాట్లాడతారు, టీవీకే పార్టీ ఉత్తర భారతదేశంలో కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది. ప్ర‌స్తుతం ఎవ‌రి అండ , మ‌ద్ద‌తు లేకుండానే కేవ‌లం 2 సంవ‌త్స‌రాల‌లోనే త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో నూత‌న అద్యాయానికి శ్రీ‌కారం చుట్టారు విజ‌య్. ఒంట‌రిగా 108 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ప‌లు పార్టీల మ‌ద్దతుతో స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు.

  • Related Posts

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    చెరువుల్లో నీళ్ల‌ను వృధా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    ప్ర‌కాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆనం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *