విశ్వ న‌గ‌రంగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దుతాం

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే ప్రధాన లబ్ధిదారు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జగన్‌ను సైకో అనాలా… పిచ్చోడు అనాలా అర్థం కావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ చేస్తున్న విమర్శలను ఖండించారు. అమ‌రావ‌తికి రాజముద్ర పడిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, ఐకానిక్ రాజధాని రోడ్లు అన్నీ ఒకేలా ఉంటాయా? అని ప్రశ్నించారు. విశాఖలో జగన్ కట్టుకున్న ప్యాలెస్‌కు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.

ఆస్తి, పదవి కోసం కార్యకర్తలను కూడా వదలరని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఆ పార్టీ కార్యకర్తనే కారు కింద వేసి తొక్కించేశారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. జీతాలు ఇస్తే చాలు అని ఉద్యోగులతో దండాలు పెట్టించుకున్నార‌ని పేర్కొన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా జగన్ తగ్గించ లేద‌న్నారు. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి అంశాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని, విద్యుత్ ఛార్జీలను తగ్గించిన చరిత్రను ఎన్డీయే ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఇకపై జగన్ చేసే ప్రతి అబద్ధపు ఆరోపణకు వడ్డీతో సహా సమాధానం చెబుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *