తిరుమ‌ల‌లో ఏఐ ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్

ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ (ఐసీసీసీ)ని తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఎన్ఆరిల దాతృత్వంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయం భక్తుల దర్శన అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేయనుందని చెప్పారు. బుధ‌వారం ఐసీసీసీ సెంట‌ర్ ను అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రితో క‌లిసి ప‌రిశీలించారు. ఇవాల్టి నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్స‌వాలు వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఈ ఉత్స‌వాల‌కు రానున్నార‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్. ఇదే స‌మ‌యంలో భక్తుల రద్దీని AI ద్వారా (real-time) అంచనా వేసేందుకు దీని ద్వారా వీల‌వుతుంద‌న్నారు. ఫేస్ రికగ్నిషన్ సీసీటీవీ తో భద్రతా పర్యవేక్షణ చేస్తామ‌న్నారు బీఆర్ నాయుడు. 3D మ్యాప్స్ ద్వారా క్యూ లైన్లు, వసతి , ఇతర సౌకర్యాలను ప‌రిశీలించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. తప్పిపోయిన వారిని గుర్తించడం, అత్యవసర మార్గాలను చూపించడం జరుగుతుంంద‌ని చెప్పారు చైర్మ‌న్. సోషల్ మీడియాలోని తప్పుడు సమాచారం , సైబర్ దాడుల నియంత్రణ మ‌రింత వీలవుతుంద‌న్నారు. భక్తుల హావభావాల ద్వారా వారి ఇబ్బందులను గుర్తించడం జ‌రుగుతుంద‌న్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐసీసీసీని ప్రారంభించనున్నార‌ని చెప్పారు.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *