జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

నాగేశ్వ‌ర్ కు వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంప‌త్ నాయ‌క్ తీవ్ర వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు.

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు. దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు. మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *