కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిగ్ వర్కర్స్‌కు తీరని ద్రోహం

ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి

హైద‌రాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) బృందం సభ్యులు. గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఈ సంగతే పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీల‌లో ఏ ఒక్క దాన్ని అమలుచే యడం లేదన్నారు.

ఈ సంద‌ర్భంగా వర్కర్స్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపును వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్స్ అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లొకుర్తి నరేష్‌లకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *