లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఇది

షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు.

స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యోగ నరసింహస్వామి ఆలయం సమీపంలోనే మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరిగివస్తూ మార్గమధ్యలో భక్తులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ కే.మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *