చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

దంచి కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా

దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025లో దుమ్ము రేపింది భార‌త జ‌ట్టు. మ‌రోసారి స‌త్తా చాటింది. సూప‌ర్ 4లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలోజ‌రిగిన కీల‌క మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు చుక్క‌లు చూపించింది. 41 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందు 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఎప్ప‌టిలాగే చుక్క‌లు చూపించాడు స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌. త‌ను రెచ్చి పోయి ఆడాడు. బంగ్లా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు . 77 ర‌న్స్ పిండుకున్నాడు. త‌న‌ను అవుట్ చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. గిల్ 29 ర‌న్స్ చేయ‌గా, మిగ‌తా వాళ్లు అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆఖ‌రున మైదానంలోకి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా రెచ్చి పోయాడు. 38 ర‌న్స్ చేయ‌డంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. 127 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది 19.3 ఓవ‌ర్ల‌లో. ఆ జ‌ట్టులో సైఫ్ హ‌స‌న్ ఒక్క‌డే రాణించాడు. త‌ను 69 బంతులు ఎదుర్కొని 51 ర‌న్స్ చేశాడు. ఇక ఇండియా జ‌ట్టు విష‌యానికి వ‌స్తే అభిషేక్ 6.2 ఓవర్లలో శుభ్‌మాన్ గిల్ (29)తో కలిసి 77 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు, ఇది భారతదేశానికి బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. కానీ గిల్ మరియు అభిషేక్ నిష్క్రమించిన తర్వాత, భారత మిడిల్ ఆర్డర్ ఆ ఊపును నిలబెట్టు కోలేక పోయింది. కుల్దీప్ యాద‌వ్ 3 వికె్లు తీస్తే వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2 వికెట్లు కూల్చాడు. అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశాడు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *