ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు 2728 కోట్లు విడుద‌ల‌

Spread the love

ప్ర‌క‌టించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్ష‌న్ దారుల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం రు.2728.67 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త‌గా 5606 స్పాజ్ ( భార్య / భ‌ర్త ) పెన్ష‌న్లు మంజూరు కాగా… ఈ ల‌బ్ధిదారుల‌కు రు 2.24 కోట్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసిన‌ట్టు మంత్రి తెలిపారు.

ఈ నిధులు అన్నీ జూన్ 1వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుంచే ల‌బ్ధిదారుల‌కు నేరుగా పంపిణీ చేస్తామ‌ని తెలిపారు కొండ‌ప‌ల్లి శ్రీనివాస్. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జూన్ నెలతో క‌లుపుకుని ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కోసం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింద‌న్నారు. అవ్వా తాత‌లు, నిరుపేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ నిధుల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల‌కు అందిస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.

  • Related Posts

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *