తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Spread the love


తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్టు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఇదిలా ఉండ‌గా తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసి పోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చార

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పౌర్ణ‌మి గ‌రుడ సేవ‌లో పాల్గొన‌డం త‌మ అదృష్టంగా భావించారు భ‌క్త బాంధ‌వులు.

  • Related Posts

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    Spread the love

    Spread the loveఅర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *