మ‌ద్యం వ్యాపారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రేప‌టి నుంచి కొత్త దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు

హైద‌రాబాద్ : ఓ వైపు మ‌ద్యం ప్ర‌మాద‌మ‌ని, తాగొద్దంటూ తెగ ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది తెలంగాణ స‌ర్కార్. కానీ మ‌రో వైపు మ‌ద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మ‌ద్యం వ్యాపారుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. కొత్త మ‌ద్యం దుకాణాలు కావాల‌ని అనుకునే వారికి సంతోషం క‌లిగించేలా నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు అధికారికంగా విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు ప్ర‌భుత్వ‌మే వెల్ల‌డించ‌డం విశేషం. కొత్త‌గా మ‌ద్యం దుకాణాలు పొందేందుకు గాను ఈనెల 26 నుండి అంటే శుక్రవారం నుండి అక్టోబర్ 18 వరకు ఫారమ్‌లను సమర్పించవచ్చు అని తెలిపింది. సామాజిక వర్గం రిజర్వేషన్లు అమలులో ఉన్న లైసెన్స్‌లు రెండేళ్ల పాటు చెల్లుతాయి. 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.

వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌లోంచి అక్టోబర్ 23న లాటరీ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త లైసెన్స్‌లను జారీ చేస్తుంది. కొత్త దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. ఎక్సైజ్ చట్టం, 1968 కింద దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులు లేదా ప్రభుత్వానికి బకాయిలు పెండింగ్‌లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా పేర్కొంది. . కేటాయింపులో గౌడ్ కమ్యూనిటీకి 15 శాతం, , షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ కోరుకునే దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాల‌ని పేర్కంది.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *