నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం కూడా

బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . త‌న‌ను బీసీసీఐ టి20 జ‌ట్టులోకి తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశాడు. ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. తాను ఒకప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు సపోర్టర్ అని చెప్పాడు వైభ‌వ్ సూర్య వంశీ. ఎప్పటికీ కోహ్లీకి అభిమానినని వైభవ్ సూర్యవంశీ వెల్లడించారు. IPL సందర్భంగా విరాట్ తన భుజంపై చేయి వేసి మాట్లాడటం ఒక కలలా అనిపించిందన్నారు.

ఆయన తనను తమ్ముడిలా ట్రీట్ చేశారని రాజస్థాన్ రాయ‌ల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. ‘కోహ్లీ నాకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారు. లోపాలు, బలాల గురించి వివరించారు. దేనిపై దృష్టిపెట్టాలో చెప్పిన తీరు అద్భుతం’ అని తెలిపాడు సూర్య‌వంశీ. ఇదిలా ఉండ‌గా తాజాగా ఇండియాలో జ‌రిగిన జ‌నాద‌ర‌ణ పొందిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున‌. అంతే కాదు 76 సిక్సుల‌తో రికార్డు సృష్టించాడు. ఫోర్లు, సిక్సుల‌తో హోరెత్తించాడు. టాప్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *