ఐపీఎల్ 19వ సీజన్ లో పేలవమైన ప్రదర్శన
ముంబై : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పాయింట్ల పట్టికలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అత్యంత దారుణమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేసింది. టాప్ క్లాస్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్ గా , ఆటగాడిగా ఫెయిల్ కావడంతో ఆ జట్టు యాజమాన్యం సీరియస్ గా ఉంది. ఇప్పటికే జట్టుకు సంబంధించి కొన్నేళ్లుగా హెడ్ కోచ్ గా ఉంటూ వచ్చాడు శ్రీలంకకు చెందిన సీనియర్ , మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే. వచ్చే ఏడాది 2027లో జరిగే ఐపీఎల్ 20 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ తో పాటు కోచ్ ను కూడా కొత్త వారిని నియమించాలని ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్మెంట్ తుది నిర్ణయానికి వచ్చినట్టు పెద్ద ఎత్తున క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ యాజమాన్యం మహేళ జయవర్ధెనెను ప్రధాన కోచ్ పదవి నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఇక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను తప్పించి హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు టాక్. అంతేకాకుండా కోచింగ్ విభాగంలో మరిన్ని మార్పులు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వివిధ జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యాలు ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్ లను మార్చే పనిలో పడ్డాయి.







