మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

Spread the love

గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్

హైద‌రాబాద్ : ఏసీబీ భారీ తిమింగ‌లాన్ని వ‌ల ప‌న్ని ప‌ట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గా ప‌ని చేస్తున్న మోహ‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. మోసపూరిత టెండర్ల ద్వారా కోట్లు పోగు చేశాడు. తెలంగాణ ఆర్&బి చీఫ్ జె. మోహన్ నాయక్, అవినీతి కాంట్రాక్టర్ల లంచాలతో సమకూర్చిన బంగారు బిస్కెట్లు, నగదు, విలాసవంతమైన విల్లాల సిగ్గుచేటైన నిల్వలను ఏసీబీ దాడులు బయటపెట్టడంతో పతనం అంచున నిలిచారు. ఇదిలా ఉండ‌గా త‌ను మాజీ మంత్రి కేటీఆర్ కు అభిమానిగా ఉన్నారు. ఇది సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్ ఇంట్లో భారీ ఎత్తున న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు, బంగారు బిస్కెట్లు, ఆస్తులు, ఫ్లాట్స్ , ప్లాట్లు, భూముల‌కు సంబంధించిన లావాదేవీలు, ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్‌లో 7 ఫ్లాట్లు, మియాపూర్‌లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో మరో కొత్త ఇల్లు , 19.38 ఎకరాల వ్యవసాయ భూమి (5 ప్లాట్లు), మరో విల్లా కోసం చెల్లించిన ₹1 కోటి అడ్వాన్స్ తో పాటు ₹55 లక్షల నగదు, దాదాపు ₹2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో ₹1.44 కోట్లు, ₹1.26 కోట్ల విలువైన విలాసవంతమైన గృహోపకరణాలు, 9 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు , 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Related Posts

    స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు…

    తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *