టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం

శ్రీ‌వారికి వెల్లువెత్తుతున్న విరాళాలు

తిరుమ‌ల : కోరిన కోరిక‌లు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం నిత్యం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో సామాన్యుల నుంచి బ‌డా బాబుల దాకా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ల‌క్ష‌లాది మంది హుండీలో డ‌బ్బుల‌తో పాటు కానుకలు కూడా స‌మ‌ర్పించు కుంటున్నారు. ఇదిలా ఉండగా భ‌క్తుల‌తో పాటు ప్ర‌ముఖ పేరు పొందిన సంస్థ‌లు, కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు తోచిన రీతిలో కానుక‌లు చెల్లిస్తున్నారు.

తాజాగా బార‌త దేశంలో అత్యంత పేరు పొందిన వాహ‌నాల త‌యారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్ చార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *